16 October 2026
Indian
Independent
Andhra Pradesh

ఇరిగేషన్ ఈఈ కేతావత్ నాగేశ్వర్ రావు మృతికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR సంతాపం

దామరచర్ల మండలం కేతావత్ తండాకు చెందిన ఇరిగేషన్ శాఖ ఈఈ కేతావత్ నాగేశ్వర్ రావు స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR వారి స్వగృహానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…అనంతరం వారి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాడె మోసి తమ గౌరవాన్ని చాటుకున్నారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని కేతావత్ నాగేశ్వర్ రావు మృతికి సంతాపం తెలిపారు…

More in Andhra Pradesh