← news.miryalaguda.co.in
‹ Wednesday, 7 October 2026 ›
No. 3

The Miryalaguda Chronicle

Digital Edition
Wednesday, 7 October 2026 Digital Edition Page 1 of 1
Andhra Pradesh

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి: బీజేపి

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి: బీజేపి

ఓట్ల నమోదుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.ఆర్డీవో కార్యాలయంలో డీఏవో శ్రీనివాస్‌కు వినతిపత్రంసమర్పించిన బిజెపి శ్రేణులు.మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని, దీనిని తక్షణమే సరిదిద్ది పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డీఏవో శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి చిల్లంచర్ల అభి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మ్యాపింగ్ కాని ఓట్లను, నకిలీ ఓట్లను కొత్త ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మ్యాపింగ్ కానీ ఓట్లకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కొత్త రకం నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ ఓటు నమోదుకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో దాదాపు 7,000 ఓట్లు మ్యాచింగ్ కాలేదని, దీనిపై గతంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.

Andhra Pradesh

విజయదశమి వేడుకలకు మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ కు ఆహ్వానం

విజయదశమి వేడుకలకు మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ కు ఆహ్వానం

మిర్యాలగూడ పట్టణంలో గత 28 సంవత్సరాలుగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయదశమి వేడుకలకు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ ను హిందూ ఉత్సవ సమితి నాయకులు ఆహ్వానించారు.

ఎన్.ఎస్.పి క్యాంపు గ్రౌండ్ నందు ప్రతి ఏటా నిర్వహించే జమ్మి పూజ,క్రాకర్ సేవ, రావణ దహన కార్యక్రమాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు యడవల్లి శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.