
1. దరఖాస్తుకు కావలసిన ముఖ్యమైన అర్హతలు:
స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం కింది విధంగా గరిష్ట వార్షిక ఆదాయ పరిమితిని నిర్దేశించింది:
-
గ్రామీణ ప్రాంత విద్యార్థులు: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలి.
-
పట్టణ ప్రాంత విద్యార్థులు: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.00 లక్షల లోపు ఉండాలి.
-
తరగతులు: కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9వ లేదా 10వ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు.
2. దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు (Documents Required):
ఆన్‌లైన్‌లో దరఖాస్తు అప్‌లోడ్ చేసే సమయంలో కింది పత్రాల ఒరిజినల్ కాపీలను స్కాన్ చేయాల్సి ఉంటుంది:
-
ఆధార్ కార్డు (విద్యార్థిది)
-
కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate)
-
ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate – ప్రభుత్వం సూచించిన పరిమితి లోపు ఉండాలి)
-
బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ (విద్యార్థి పేరు మీద ఉన్న ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ స్పష్టంగా కనిపించాలి)
-
స్టడీ సర్టిఫికెట్ / బోనఫైడ్ (ప్రస్తుత పాఠశాల నుంచి పొందింది)
-
పాస్‌పోర్ట్ సైజు ఫొటో
3. దరఖాస్తు చేసుకునే విధానం:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ – ఈ-పాస్ పోర్టల్: అర్హత గల విద్యార్థులు కొత్తగా (Fresh) లేదా గత ఏడాది పొంది ఉంటే ఈ ఏడాదికి (Renewal) దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వ అధికారిక స్కాలర్‌షిప్ పోర్టల్ తెలంగాణ ఈ–పాస్ (Telangana e-PASS) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, దానికి సంబంధించిన హార్డ్ కాపీని (Printout) పైన పేర్కొన్న అన్ని ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి (HM) వెరిఫికేషన్ నిమిత్తం సమర్పించాలని జిల్లా అధికారి సంజీవయ్య సూచించారు.

