మిర్యాలగూడలో ఘనంగా మహిళా విభాగం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్స్
మిర్యాలగూడ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో NVR మరియు BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా విభాగం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఫైనల్స్ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫైనల్స్లో ఉత్సాహంగా పోటీపడిన క్రీడాకారిణులను అభినందించిన ఎమ్మెల్యే BLR, విజేతలకు బహుమతులను అందజేశారు.
మహిళలు క్రీడల్లో రాణించడం ఎంతో అభినందనీయమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించిన NVR మరియు BLR బ్రదర్స్ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులోనూ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తూ, వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



