17 October 2026
Indian
Independent
Andhra Pradesh

నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకుండా విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తున్న రేవంత్ ప్రభుత్వం – BRS నేతల ధ్వజం

 

జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక BRS నేతలు ఎండి యూసుఫ్, మాజీ ZPTC లలిత హతిరాం నాయక్ మాట్లాడుతూ.. నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకుండా విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తున్న రేవంత్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దామరచర్ల మండల కేంద్రంలో విద్యుత్ కోతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోందని విమర్శించారు.

అదేవిధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ బి. సురేష్ నాయక్ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి, విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, గిరిజన బిడ్డకు న్యాయం చేయాలని నినదించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక BRS నేతలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

More in Andhra Pradesh